Model house for poor people in AP:ఏపీ లో పేదవాడి గూడు ఇదే!

Model house for poor people in AP: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దాదాపు సిద్ధం అయింది. ఆగష్టు 15 వ తేదీన రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణి చేయబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-16 15:13 GMT
sample-of-patta-houses

AP Govt Release Sample Of Patta House: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దాదాపు సిద్ధం అయింది. ఆగష్టు 15 వ తేదీన రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణి చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన ఈనెల 8 వ తేదీన ఇళ్ల పట్టాలు పంపిణి చేయాల్సి ఉన్నా, కరోనా మరియు కోర్టులో కేసులు వేయడంతో కార్యక్రమం వాయిదా పడింది. ఇక ఇదిలావుంటే పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలంలో ఇంటిని నిర్మించేందుకు కూడా సిద్ధం అవుతోంది.

ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇంటికి సంబంధించిన ప్లాన్ దాదాపు సిద్ధం అయింది.. ఈ సెంటు భూమిలో చిన్న కుటుంబానికి సరిపోయే విధంగా ఇంటి నమూనాని కూడా ప్రభుత్వం తయారు చేసింది. ఇందులో హాల్, బెడ్ రూమ్, కిచెన్, బాత్ రూమ్ అన్ని కుటుంబానికి సరిపోయే విధంగా డిజైన్ చేశారు. ఇక ఈ మోడల్ లోనే పేదల పక్కా ఇళ్ల నిర్మాణం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తేలియాజేస్తున్నాయి. రాష్ట్రంలో నూతనంగా నిర్మించబోయే ఈ పక్కా ఇళ్లకు సంబంధించిన ఫోటోలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవి జనాలను ఆకట్టుకునే ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నమూనా చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News