Masks Distribution For Students in AP: విద్యార్ధులకు మాస్క్లుల పంపిణీ..
Masks Distribution For Students in AP: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..
Masks Distribution For Students in AP: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లలో చిదివే విద్యార్ధులకుమాస్క్లులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. స్కూళ్లు తెరిచే సమయానికి ఒకొక్కరికి మూడు మాస్క్లులు చొప్పున పంపినే చేయనుండగా.. వీటి సరఫరా బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీకిఅప్పగించింది. సుమారు 40 లక్షల మంది పిల్లలకు మాస్కులు పంపిణీ చేయనుంది.
గడిచిన 24 గంటల్లో 8,601 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,463 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,601 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,741 మంది డిశ్చార్జ్అ య్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,58,817. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,368. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,65,933కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 89,516 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,463 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 32,92,501 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.