AP DGP Gautam Sawang: ఆలయాలు, ప్రార్ధనా మందిరాలకు నిఘా పెంచండి: డీజీపీ గౌతం సవాంగ్

AP DGP Gautam Sawang | కొంత మంది ఆకతాయలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నా రు.

Update: 2020-09-12 14:05 GMT

AP DGP Gautam Sawang | కొంత మంది ఆకతాయలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్యానించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని.. లైట్లు, సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జియో త్యపింగ్, నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామన్నారు.

అంతే కాదు, గుడివాడలో జరిగిన ఆలయం చోరీ ఘటనపై రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ.. ఈ నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్  బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. 

Tags:    

Similar News