Anandayya Mandu: ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతున్న ఆనందయ్య ఔషధం
Anandayya Mandu: ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.
Anandayya Mandu: ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. మందు పంపిణీకి సర్వం సిద్ధం అవుతున్న వేళ ఆనందయ్య ఔషధం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యే కాకాణి మందును క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నరన్న సోమిరెడ్డి కామెంట్స్‌తో ఆనందయ్య మందు అంశం సోమిరెడ్డి వర్సెస్ కాకాణి గోవర్థన్‌గా మారిపోయింది.
ఆనందయ్య ఔషధం అంశం ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతుంది. మందు పంపిణీకి సర్వం సిద్ధం అవుతున్న వేళ మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందును సొమ్ముచేసుకోవాలన్నదే కాకాణి గోవర్థన్ రెడ్డి ప్లాన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై గంటల వ్యవధిలోనే స్పంధించిన కాకాణి సోమిరెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం అటూ సవాల్ విసిరారు.
ఆనందయ్య కరోనా మందుని క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పేదలకు ఉచితంగా ఇస్తున్న మందుతో వ్యాపారం చేసి కోట్లు గడించేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పథకం పన్నారని ఆరోపించారు. గత నెల 21 నుంచే ఎమ్మెల్య కాకాణి కుట్రలు ప్రారంభమయ్యాయన్న సోమిరెడ్డి కోటి మందికి మందుని ఆన్‌లైన్ ద్వారా అమ్మి 120 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ఎమ్మెల్యే కాకాణి కుట్రపన్నారన్నారు.
మరోవైపు సోమిరెడ్డి కామెంట్స్ కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సోమిరెడ్డి నిరూపించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించని కారణంగానే ఆనందయ్య ఔషధాన్ని నిలిపివేశారని గుర్తు చేశారు. ఆనందయ్య మందుకీ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. అంతేనా, దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం' అని సోమిరెడ్డికి కాకాణి సవాల్ కూడా విసిరారు.
ఇదిలా ఉంటే.. ఆనందయ్య మందు సోమవారం నుంచీ అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మందు తయారీ ప్రారంభించినప్పటికీ అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేగడంతో ఈ ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.