విజయవాడలో అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్సులను రిటైరైన జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రమేష్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్మెంట్ రోజునే 13 కోవిడ్ సెంటర్లను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ఉన్న 22 కోవిడ్ సెంటర్లలో తొమ్మిది సెంటర్లను ప్రభుత్వం గతంలో రద్దు చేయగా, డాక్టర్ రమేష్ మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ నాలుగు రోజుల క్రితం (ఆగస్టు 31) ఆదేశాలిచ్చారు. అనుమతులు ఇచ్చిన ఆయనే రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాలపై కలకలం రేగుతుంది. అయితే తన సర్వీసులో చివరి రోజున DMHO రమేష్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.