ఏపీలో మరో కొత్త రూల్.. ఆధార్‌ ఉంటేనే మద్యం

Update: 2020-05-07 04:43 GMT
representative image

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది. దీనితో ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో మద్యం షాపులు గత సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ధరలు పెంచినప్పటికి మందుబాబులు మాత్రం దుకాణాలు వద్ద భారీ క్యూలు కడుతున్నారు. ఎండలను సైతం లెక్క చేయడం లేదు.

ఏపీలో రెడ్ జోన్ల నుంచి కొందరు ఇతర జోన్లకు మద్యం కోసం వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనను తెచ్చింది. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకపోవడంతో, ఆ ప్రాంతాలకు చెందిన వారు.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారికి మద్యం విక్రయించకుండా ఉండటం కోసం ఆధార్ కార్డును పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. ముఖానికి మాస్క్, గొడుగులు ధరించి మాత్రమే మద్యం కోసం రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News