కృష్ణా జిల్లలో విషాదం: కౌలు రైతు ఆత్మహత్య!
పొలంలో పెట్రోల్ పోసుకుని రైతు లక్ష్మీనారాయణ ఆత్మహత్య పంటకి మద్దతు ధర రాకపోవడం, మార్కెటింగ్ అధికారులు..బయ్యర్లతో కుమ్మక్కవడంతో నిండు ప్రాణం బలి
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో ఘోరం జరిగింది. పంటకి మద్దతు ధర రాకపోవడం, మార్కెటింగ్ అధికారులు.. బయ్యర్లతో కుమ్మక్కవడంతో రైతు లక్ష్మీనారాయణ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 15ఎకరాల పొలం కౌలుకు తీసుకున్న రైతు లక్ష్మీనారాయణ అందులో పత్తి పంట సాగు చేస్తున్నాడు. అయితే అకాల వర్షాలతో పత్తిపంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గింది. అటు పంట పండిచడానికి లక్షీ నారాయణ 8లక్షల రూపాయలు అప్పుచేసినట్లు తెలుస్తోంది. పంటకు మద్దతు ధర రాకపోవడం, అటు అప్పుల బాధ ఎక్కవవడంతో ఏం చేయాలో తోచక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.