గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో సున్నా మార్కులు ఎంతమందికి వచ్చాయో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఇటీవల రాత పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలకు సంబంధించి మొన్న ఫలితాలు వెలువడ్డాయి. మెరిట్ ఆధారంగా ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి కాల్ లెటర్లు కూడా పంపించారు అధికారులు. మెరిట్ వచ్చిన అభ్యర్థుల గురించి పక్కన పెడితే.. పరీక్ష రాసిన వారిలో సున్నా మార్కులు వచ్చిన అభ్యర్ధులూ ఉన్నారు. నెగెటివ్ మార్కుల విధానముతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇలా ఎంత మందికి సున్నా మార్కులు వచ్చాయో తెలుసా? 2,478 మందికి సున్నా లేదా అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. మోయుత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు 19.5 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఐటీ వారిలో 1.98 లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. ఇక మిగిలిన వారిలో రెండువేలకు పైగా సున్నా మార్కులతో నిలిచారు.
వీరిలో కేటగిరీ-1 పరీక్షలు రాసిన వారిలో ఎక్కువ మందికి సున్నా మార్కులు వచ్చాయి. 11.5 లసుఖాల మంది ఈ కేటగిరీ లోపరీక్ష రాయగా వారిలో 1,588 మందికి సున్నా వచ్చాయి. ఇక కేటగిరీ 3 లో 523 మందికీ, కేటగిరీ 2 లో రెండు గ్రూపులకు కలిపి 367 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.
నెగెటివ్ మార్కుల విధానం వలన ఈ పరిస్థితి తలెత్తింది. ఇటువాని పరీక్షలు రాసే అభ్యర్థులు నెగెటివ్ మార్కుల అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి సున్నా ఫలితాలు రావని నిపుణులు చెబుతున్నారు.