TS PECET 2020 Postponed: పీఈసెట్‌ దరఖాస్తులకు గడువు పెంపు...ఎప్పటి వరకంటే..

TS PECET 2020 Postponed: పీఈసెట్ రాయాలనుకునే విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి శుభవార్త తెలిపింది.

Update: 2020-07-01 06:48 GMT

TS PECET 2020 Postponed: పీఈసెట్ రాయాలనుకునే విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి శుభవార్త తెలిపింది. దరఖాస్తు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15వ తేదీ వరకు డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్‌ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం వెల్లడించారు. పీఈసెట్ ప్రవేశపరీక్షను రాసేందుకు గాను ఇప్పటి వరకు 5,678 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

ఇక ఇటు రాష్ట్రంలో మొన్న ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధుల రీ వెరిఫికేషన్ కు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 73,984 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కమ్‌ ఫొటో కాపీలకు మొత్తంగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా వారిలో రీ వెరిఫికేషకన్‌‌ ఫొటో కాపీ కోసం 59,651 మంది, రీకౌంటింగ్‌ కోసం 14,333 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు వర్గాలు తెలిపాయి. వెరిఫికేషన్‌కు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న వేళ తెలంగాణ అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకూ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది కాగా.. ప్రభుత్వ నిర్ణయం‌తో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌ వాయిదా పడ్డాయి.


Tags:    

Similar News