పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.

Update: 2020-06-15 11:45 GMT

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 114 పోస్టులను భర్తీ చేయనుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ లో సదరన్ రీజియన్‌లో అప్రెంటీస్ 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరీలో ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 29 చివరి తేదీ. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఖాళీల వివరాలు ఇవే...

* మొత్తం ఖాళీలు- 119

* ఐటీఐ ఎలక్ట్రికల్- 30

* గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5

* గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 22

* అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 14

* డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 11

* గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 11

గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

*2020 జూన్ 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం

*2020 జూన్ 29 దరఖాస్తులకు చివరి తేదీ

విద్యార్హతల:

*సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 


Tags:    

Similar News