KTET పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్
ఈ నెలలో కేరళలో నిర్వహించే KTET పరీక్ష అడ్మిట్ కార్డులను కేరళ పరీక్ష భవన్ అధికారిక వెబ్ సైట్ లో భద్రపరిచింది.
ఈ నెలలో కేరళలో నిర్వహించే KTET పరీక్ష అడ్మిట్ కార్డులను కేరళ పరీక్ష భవన్ అధికారిక వెబ్ సైట్ లో భద్రపరిచింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 15, 16 తేదీలలో జరగాల్సి ఉండగా హాల్ టికెట్‌లో KTET కేటగిరీ 1,2,3,4 పేపర్‌ల పరీక్ష షెడ్యూల్ తెలిపింది. KTET కేటగిరీ 1, కేటగిరీ 2 పరీక్షను ఫిబ్రవరి 15 న, KTET కేటగిరీ 3, 4 పరీక్షను ఫిబ్రవరి 16 న నిర్వహించనున్నారు. ఇక పోతే హాల్ టికెట్ లో పరీక్షా తేదీ, సమయం, పరీక్షా కేంద్రం, అభ్యర్థుల రోల్ నంబర్ అన్ని వివరాలను తెలియజేస్తుంది. దాంతో పాటు KTET పరీక్ష 2020 పరీక్ష సమయంతో పాటు పూర్తి షెడ్యూల్ ను, అభ్యర్థి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలను కూడా పేర్కొంది.
ఇక పోతే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. కేరళ టెట్ అడ్మిట్ కార్డును తప్పకుండా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని తెలిపారు.
KTET అడ్మిట్ కార్డ్ 2020 ను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
♦ ktet.kerala.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి.
♦ KTET 2020 అడ్మిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
♦ మీకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
♦ KTET 2020 అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
KTET 2020 పరీక్ష షెడ్యూల్
♦ KTET క్యాటగిరి 1 : 15 ఫిబ్రవరి 2020, పరీక్ష కాలం 2.30 గంటలు, సమయం : ఉదయం 10:00 నుంచి 12:30 గంటల వరకు
♦ KTET క్యాటగిరి 2 : 15 ఫిబ్రవరి 2020, 2.30 గంటల సమయం, పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4.30 వరకు
♦ KTET క్యాటగిరి 3 : 16 ఫిబ్రవరి 2020, 2.30 గంటలు, పరీక్ష సమయం : మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4.30 వరకు
♦ KTET క్యాటగిరి 4 : 16 ఫిబ్రవరి 2020, 2.30 గంటలు, పరీక్ష సమయం : మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4.30 వరకు
సూచనలు..
♦ KTET అడ్మిట్ కార్డులో పేర్కొన్న విధంగా అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
♦ బాల్‌పాయింట్ పెన్నులతో పాటు మీ అడ్మిట్ కార్డు, ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటోలను తీసుకెళ్లాలి.
♦ అడ్మిట్ కార్డ్ తో పాటు మరో ఐడీ ప్రూఫ్ ను తీసుకెళ్లాలి.
♦ వీటిలో ఏ ఒక్కటి మర్చిపోయినా KTET పరీక్ష రాయడానికి అనుమతించబడరు.
KTET 2020: అడ్మిట్ కార్డు, సిలబస్, ప్రశ్నపత్రం నమూనా కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...