LIC HFL Jobs : ఎల్ఐసీలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Update: 2019-12-04 12:52 GMT

నిరుద్యోగ యువతకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ LIC HFL అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో భాగంగా మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులు అర్హులు. దీంతో పాటు అభ్యర్దులు ఏదో ఓ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులను ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన తర్వాత అభ్యర్థులకు ఒక ఏడాది కాలం పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ఈ దరఖాస్తుల స్వీకరణ 2019 డిసెంబర్ 16కి ముగియనుంది.

ఈ దరఖాస్తులను https://www.lichousing.com/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి ఈ సెక్షన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఖాళీల సంఖ్య

అసిస్టెంట్ మేనేజర్ - 35

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు - 2019 డిసెంబర్ 2

దరఖాస్తుకు చివరి తేదీ - 2019 డిసెంబర్ 16

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ - 2020 జనవరి 27

విద్యార్హతలు

న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (LLB) 55 శాతం యూఏఈనులై ఉండాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి

వయస్సు 2019 జనవరి 1 నాటికి 23 నుంచి 30 ఏళ్లు.

వేతనం- రూ.56,000 

Tags:    

Similar News