Coronavirus: ఆ గ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు

Coronavirus: భారత్‌లో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం ఆగడం లేదు.

Update: 2021-06-08 06:52 GMT

Coronavirus: ఆ గ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు

Coronavirus: భారత్‌లో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా కరోనా అందరినీ బలి తీసుకుంటోంది. దాదాపు అన్నీ చోట్ల ఇదే పరిస్థితి. కానీ ఆఒక్క గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాలేదు. ఇంతకీ ఆగ్రామం ఎక్కడవుంది అనుకుంటున్నారా..?

కోవిడ్‌ విజృంభిస్తున్నా ఆగ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అదే సంగారెడ్డి జిల్లా కాశవాడ గ్రామం. గ్రామ జనాభా మూడువందలు కాగా సుమారు 150 ఇళ్లు ఉంటాయి. వీరిలో 30శాతం మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుండగా, మిగిలిన వారు కులవృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తాము తీసుకుంటున్న జాగ్రత్తలే కరోనా బారిన పడకుండా కాపాయిడయంటున్నారు గ్రామస్తులు.

ఇప్పటికీ గ్రామంలో ఎక్కడ చెత్త లేకుండా చూడడం, ప్రతి వీధిలో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడంతోపాటు ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేసుకుంటున్నారు ఆగ్రామ ప్రజలు. ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటి కోవిడ్‌ నిబంధనలు తూచతప్పకుండా పాటిస్తున్నారు. శానిటైజర్‌ను వాడుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్న కాశవాడ గ్రామస్తులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

తమ జీవనోపాధి కోసం పక్క గ్రామాలకు వెళ్తున్న ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. బయటికి వెళ్లిన వాళ్లు ఇంటికి రాగానే చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మరికొంతమందయితే ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. మరోవైపు గ్రామ యువత ఎప్పటికప్పుడు ప్రజలకు కోవిడ్‌ పట్ల అవగాహాన కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో కాశవాడ గ్రామంలో ఒక్కరూ కూడా కరోనా బారిన పడకపోవడం ఊరటనిస్తోంది.

Full View


Tags:    

Similar News