YS Sharmila: కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైపోయింది
YS Sharmila: కేసీఆర్ పాలనలో ధనికరాష్ట్రం అప్పులపాలైంది
YS Sharmila: కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. కాళేశ్వరం పేరుతో నీళ్లు ఎత్తిపోసి 9వేల కోట్ల కరెంట్ బిల్లులు రాష్ట్ర ప్రజలపై మోపారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేశారని ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి బంగారు తెలంగాణ కాస్త... అప్పుల తెలంగాణగా మారిపోయిందని షర్మిల ఆరోపించారు. ఇచ్చిన హామీలు మరిచిపోయి ఫౌంహౌజ్ పాలనకు కేసీఆర్ తెరతీశారని మండిపడ్డారు. కరెంట్ కోనుగోళ్లతో పాటు, డిస్కం తప్పిదాల వల్లే బకాయిలు పెరిగిపోయాయన్నారు. కేసీఆర్ తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు షర్మిల.