గులాబీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారా అలజడి రేపిన కొన్ని పరిణామాలపై సీరియస్‌గా హెచ్చరించారా ఇంకోసారి అలా తలదూర్చితే, ఊరుకునేదిలేదని క్లియర్ కట్‌గా చెప్పారా.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారా అలజడి రేపిన కొన్ని పరిణామాలపై సీరియస్‌గా హెచ్చరించారా ఇంకోసారి అలా తలదూర్చితే, ఊరుకునేదిలేదని క్లియర్ కట్‌గా చెప్పారా ఇంతకీ ప్రజాప్రతినిధులకు గులాబీ బాస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఏ విషయంలో హెచ్చరించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్య, తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనతో మరింత వేడెక్కాయి పరిణామాలు. అధికారపక్షంపై విపక్షాలు, విపక్షంపై అధికారపక్షం పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. పని ఒత్తిడి, అధికార పార్టీ ఎమ్మెల్యేల జోక్యంతో విధులు నిర్వహించ లేకపోతున్నామని రెవెన్యూ సంఘాలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ ప్రజాప్రతినిధులకు, సీఎం కేసీఆర్ ముందస్తు హెచ్చరికలతో కూడిన క్లాస్ తీసుకున్నారట.
ఎమ్మెల్యేలంతా రెవెన్యూ వివాదాలకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారట గులాబీ అధినేత. అసలు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లొద్దని భూ పంచాయతీల్లో తల దూర్చొద్దని వార్నింగ్ మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, అది ఎమ్మెల్యేలుగా మీపైకి మళ్లితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారట.
సాధారణంగా ఎమ్మెల్యేల వద్దకు ఎక్కువగా వచ్చే దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి రెవెన్యూశాఖకు పంపితే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని గులాబీ బాస్ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పాటు తహసీల్దార్ హత్య, తదనంతరం నెలకొన్న పరిణామాలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఎమ్మెల్యేలకు సీఎం సూచినట్లు తెలుస్తోంది.
భూములకు సంబంధించిన వ్యవహారంలో అన్ని పక్షాలకు న్యాయం చేయడం సాధ్యం కాదని ఒకరికి సహాయం చేస్తే మరో పక్షం శత్రువుగా మారుతుందని హితబోధ చేశారట సీఎం కేసీఆర్. అందుకే భూ వివాదాల్లో తలదూర్చడం మానుకుని, సమస్య పరిష్కారాన్ని రెవెన్యూ శాఖ, న్యాయస్థానాలకే వదిలేయాలని సూచించారట సీఎం. కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాస్పద భూముల్లో లావాదేవీలు చేస్తున్నా, వెంటనే చట్ట పరంగా పరిష్కరించుకోవాలని, భవిష్యత్తులో మీ మెడకే చుట్టుకునేలా చూసుకోవద్దని ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట సీఎం.