Amit Shah: 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవం జరపలేదు

Amit Shah: విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది

Update: 2022-09-17 05:39 GMT

Amit Shah: 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవం జరపలేదు

Amit Shah: విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని.. ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారని చెప్పారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు. దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్‌ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. నిజాం, రాజాకార్ల ఆగడాలకు ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ పటేల్‌ ముగింపు పలికారని కొనియాడారు. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారని అమిత్‌షా అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే వేడుకలు జరపాలని, కొందరు ఇతర పేర్లతో జరుపుతున్నారని అమిత్ షా విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేశారని అన్నారు.

Tags:    

Similar News