Covid19: కరోనా కట్టడికి రెండే మార్గాలు ఉన్నాయి- హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
Covid19: నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయి
Covid19: నిర్లక్ష్య ధోరణి కారణంగానే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కట్టడికి రెండె రెండు మార్గాలున్నాయన్నారు. ఒకటి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం, మరోటి వ్యాక్సిన్ వేయించుకోవడమని ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపడుతుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకురావాలని సూచించారు.
తెలంగాణలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. గ్రేటర్ పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్ ప్రభావం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడుతోంది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఈ ఐదు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో నిజామాబాద్ జిల్లాలో 600, కామారెడ్డి జిల్లాలో 400, నిర్మల్‌లో 470, ఆదిలాబాద్ జిల్లాలో 250 మంది కొవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ ప్రతిరోజు వందలాది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.