దసరా పండక్కి ఊరెళ్లేవారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సాధారణ ఛార్జీలతోనే దసరా స్పెషల్ బస్సులు

*అదనపు బాదుడు లేకుండా ఈసారి సాధారణ ఛార్జీలు, ఈసారి దసరాకు 4,198 ప్రత్యేక బస్సులు

Update: 2022-09-22 05:05 GMT

దసరా పండక్కి ఊరెళ్లేవారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సాధారణ ఛార్జీలతోనే దసరా స్పెషల్ బస్సులు

TSRTC Dussehra Special Buses: నష్టాల నుండి గట్టెక్కుతున్న TSRTC ఈ ఏడాది దసరా పండగకు అదనపు ఆదాయం రాబట్టుకునేందుకు రెడి అవుతోంది. గతంలో ఏ పండగ వచ్చినా అదనపు బాదుడుతో ప్రయాణికుడి జేబుకు చిల్లుపెడేది. కానీ ఈసారి అదనపు బాదుడు లేకుండా పండుగకు నగరం నుంచి ప్రయాణికుడిని సొంతూళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఎక్కే అవకాశం లేకుండా వారి వద్దకే బస్సులను పంపి అదనపు రాబడి కోసం కొత్త దారులను అన్వేషిస్తుంది.

ఈ ఏడాది దసరాకు నగర ప్రయాణికుడికి అదనపు బాదుడు లేకుండా సాధారణ చార్జీలతోనే గమ్య స్థానాలకు చేర్చేందుకు TSRTC ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది మాదిరిగానే ఈసారి దసరాకు 4వేల 198 బస్సు సర్వీసులను నడపనుంది. దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 24, 25, ఈనెల 30 నుండి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 24, 25న 737 బస్సులు, ఈనెల 30 నుండి వచ్చే నెల 5 వరకు 3వేల 461 బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యింది. అంతేకాకుండా పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ కోసం 517 బస్సులను అందుబాటులో ఉంచింది.

పండగ ముందు రోజుల్లో MGBS వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటంది. కొన్ని బస్సులను ఆయా ప్రాంతాల నుండి నడపనున్న TSRTC దసరా సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సు సర్వీసులు నడపనుంది. ప్రతి ఏడాది నగర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. హైదరాబాద్‌లోని పలు చోట్ల ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ బస్ పాయింట్స్ వద్ద ప్రైవేటు వాహనదారులు.. ప్రయాణికులను ఎక్కించుకుని సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో ఆర్టీసీ పాయింట్స్‌లో ప్రైవేట్ వాహనాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోబోతుంది. గతేడాది దసరా సందర్భంగా మొత్తం 8రోజులకు గాను 14 కోట్ల 79 లక్షలు ఆదాయం రాబట్టుకుంది. ఇక ఈసారి అంత కంటే ఎక్కువ ఆదాయం రాబట్టాలని ప్రణాళికలు చేస్తోంది.



Tags:    

Similar News