హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. టెన్త్ పరీక్షలకు గంట ముందే చేరుకోవాలన్న అధికారులు

Traffic Diversions: ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

Update: 2023-04-08 02:47 GMT

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. టెన్త్ పరీక్షలకు గంట ముందే చేరుకోవాలన్న అధికారులు

Traffic Diversions: ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. నేడు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌లో వందే భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ ఫ్లాగ్- ఆఫ్, పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో జరుగనున్న బహిరంగ సభకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు నుంచి పరేడ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మోడీ టూర్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. ‌ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటా 30నిమిషాల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ప్రధాని సభకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల వెహికల్స్‌కు దోబీఘాట్‌‌‌‌‌‌‌‌, బైసన్ పోల్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్​లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని చెప్పారు.

ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి స్వీకార్‌, ఉపకార్‌ జంక్షన్‌ వరకు రెండు వైపుల రోడ్డు మూసివేయనున్నారు. టివోలి ఎక్స్‌ రోడ్స్‌ నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు, చిలకలగూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు అఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ దారిని ఉపయోగించుకొని సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాల్సి ఉంటుందని పోలీసులు వివరించారు. కరీంనగర్‌ నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా హైదరాబాద్ వచ్చే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా రావాల్సి ఉంటుంది.

అలాగే ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. కీసర తిరుమలగిరి క్రాస్‌రోడ్డు నుంచి ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి. కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ దార్ల గుండా వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.

ప్రధాని మోడీ వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించనున్న నేపధ్యంలో రైల్వేశాఖ ప్యాసింజర్లకు గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం నెంబర్ 1 నుంచి 8 వరకు వెళ్లే ప్యాసింజర్లు ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం నెంబర్ 1కి వెళ్లే ఎంట్రీ నుంచి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది.

టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను అలర్ట్ చేశారు అధికారులు. ఉదయం 8.30 నిమిషాల వరకే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానుండటంతో ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు డీఈవో రోహిణి. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని తెలిపారు. 

Tags:    

Similar News