TS Assembly: ఇవాళ ఆరవరోజు బడ్జెట్ సమావేశాలు

TS Assembly: బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి

Update: 2024-02-15 03:20 GMT

TS Assembly: ఇవాళ ఆరవరోజు బడ్జెట్ సమావేశాలు

TS Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనుంది శాసనసభ. దీంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేలా.. కులగణన బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాల ఉభయ సభల్లో కాగ్‌ రిపోర్టును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను కూడా టేబుల్ చేయనుంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికపై సభలో ఘాటుగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News