Tarun Chugh: సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అవినీతికి ఇదే నిదర్శనం..
* ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై స్పందించిన టీబీజేపీ ఇంఛార్జ్
Tarun Chugh: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై టీబీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. కవిత పేరు ఛార్జీషీటులో బయటపడిందన్న ఆయన సౌత్ గ్రూప్ పేరుతో భారీ కుంభకోణం చేశారన్నారు. 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయని. 192 కోట్ల ప్రయోజనం కలిగిందని ఈడీ పేర్కొందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అవినీతికి ఇదే నిదర్శనమన్నారు. ఈడీ ఛార్జీషీటులో అనేక పర్యాయాలు కవిత పేరు పేర్కొన్నారని. 10 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ ఛార్జీషీట్లో ఉందన్నారు.
కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణ దాటి ఢిల్లీ వరకు చేరిందని తరుణ్ చుగ్ విమర్శించారు. అందుకే కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ కలిశారని విమర్శించారు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎవరెవరున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని దోషులకు శిక్ష పడుతుందన్నారు.