Rythu Runamafi: రేపు తెలంగాణలో మూడో విడత రుణమాఫీ

Rythu Runamafi: ఖమ్మం జిల్లా వైరాలో రూ.2లక్షల రుణమాఫీ చేయనున్న సీఎం

Update: 2024-08-14 13:48 GMT

Rythu Runamafi: రేపు తెలంగాణలో మూడో విడత రుణమాఫీ

Rythu Runamafi: తెలంగాణలో మూడో విడత రైతు రుణమాఫీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన సర్కార్.. రేపు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగసభలో సీఎం రేవంత్ మూడో విడత రుణమాఫీ చేయనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవనుంది.

Tags:    

Similar News