Kamareddy: హుండీలో చేయి పెట్టిన దొంగ.. చేయి ఇరుక్కుపోయి రాత్రంతా నరకయాతన
Kamareddy: సొమ్ము కాజేసేందుకు హుండీలో చేయి పెట్టిన దొంగ
Kamareddy: హుండీలో సొమ్ముపై కన్నేసిన ఓ ఆలయ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో అమ్మవారి హుండీలో సొమ్ము కాజేసేందుకు అందులో చేయి పెట్టాడు. అతని చేయి కాస్త.. ఆ హుండీలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా హుండీలోనుంచి ఆ దొంగ చేయి బయటకు రాలేదు. హుండీలో చేయి ఇరుక్కపోయి తెల్లవార్లూ నరకయాతన చెందాడు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆలయంలో పనిచేసే ఉద్యోగి సురేష్.. రాత్రి 10 గంటల సమయంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు. డబ్బు దొంగిలించేందుకు హుండీలో చేయి పెట్టాడు. అంతే సురేష్ చేయి కాస్త.. హుండీలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా చేయి బయటకు రాలేదు. పెద్దగా అరవలేక రాత్రంతా గింజుకుంటూ నానా యాతన పడ్డాడు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు గమనించి స్థానికులకు సమాచారమందించారు. గ్రామస్తులు వచ్చి సురేష్ చేతిని బయటకు తీసి.. అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ వీడియో వైరల్ అవుతోంది.