Medaram: మేడారం జాతరకు పరిపూర్ణ శోభ

Medaram: చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకున్న సమ్మక్క, దారిపొడవునా మోకరిల్లిన భక్తజనం.

Update: 2022-02-18 02:33 GMT

Medaram: మేడారం జాతరకు పరిపూర్ణ శోభ

Medaram: అడవి తల్లి సమ్మక్క వనం నుంచి జనంలోకి వచ్చింది. చిలకలగుట్ట నుంచి బెలెల్లిన అమ్మకు దారిపొడవునా భక్తజనం మోకరిల్లింది. మేడారం తన్మయత్వంతో ఊగిపోయింది. కుంకుమభరణె రూపంలో తల్లి దర్శనమివ్వడంతో మహాజాతరలో ఉద్విగ్నమైన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ నిన్న రాత్రి సమ్మక్క గద్దెపై కొలువుదీరింది. తల్లీబిడ్డలు గద్దెలపై ఆసీనులవ్వడంతో మేడారం జాతరకు పరిపూర్ణ శోభ వచ్చింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుని చూసి భక్తులు పులకాంకితులవుతున్నారు. వనదేవతల దర్శనానికి జనం పోటెత్తారు.

దాదాపు 100 మందికి పైగా చిలకలగుట్టకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలో అమ్మవారిని తీసుకుని పూజారులతో కలిసి గుట్ట కిందకు వస్తుండగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌... గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం వినగానే చిలకలగుట్ట పరిసరాలు సమ్మక్క నామస్మరణతో ప్రతిధ్వనించాయి. చిలకలగుట్ట ముఖద్వారం చేరుకోగానే మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. సరిగ్గా రాత్రి 9గంటల16 నిమిషాలకు సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠింపజేశారు. పూజారులు గద్దెల ఆవరణలోని విద్యుత్తు దీపాలను ఆర్పివేసి పూజలు చేశారు.

Tags:    

Similar News