కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం గంపెడాశలుపెట్టుకుంది. ఈ బడ్జెట్ లోనైనా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ, రైల్వే ,రోడ్డు ప్రాజెక్టుల వస్తాయని భావిస్తోంది. ప్రోగ్రెసివ్ స్టేట్ గా రాష్ట్రం ఉన్నా దరిమిళ ఈ సారి కేంద్రం బడ్జెట్ లో సహకారం అందిస్తుందని అశలుపెట్టుకుంటోంది కేసీఆర్ సర్కార్.
ఆర్ధికమాంధ్యం ప్రభావంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ప్రభుత్వలకు వచ్చే ఆదాయ మార్గాలు తగ్గడంతో సంక్షేమ ప్రధాకాలు ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర్రం కష్టాలు ఎదుర్కొంటోంది. అంతేకాక ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాకపోవడం, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలు తక్షణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ వస్తోంది రాష్ట్ర్ర ప్రభుత్వం.
ఇక ఈసారి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పథకాలు, మిషన్ భగీరథ కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 15వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం 40,169.20 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు కనీసం 12,772 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాక 14వ ఆర్థిక సంఘం గతంలో నిధులివ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని గుర్తుచేస్తోంది తెలంగాణ సర్కార్.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాల్వంచలో ఇంటిగ్రేటడ్ ప్లాంటు ఏర్పాటుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనికి ఇప్పటి వరకు నిధులు,అనుమతులు మంజూరు చేయలేదు. విభజన చట్టంలో ఎయిమ్స్ ప్రకటించినా అనుమతులు, కేటాయింపులు లేవు. అలాగే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కదలికే లేదు. కొత్త రైలు మార్గాలకు నిధులు, కొత్త రైళ్లను ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం కోరుతోంది.
దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. భారీ ఖర్చుతో చేపట్టిన ఈ పథకాలకు సాయం చేయాలని కోరుతున్నారు. ఈసారి బడ్జెట్ లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్దిక మాంద్యం నుండి గట్టెక్కుతామని అంటోంది తెలంగాణ సర్కార్.