Telangana Old Secretariat Building Demolition Begins: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం
Telangana Old Secretariat Building Demolition Begins: తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Telangana Old Secretariat Building Demolition Begins: తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మొహరించి ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను మూసివేశారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది.
పోతే సచివాలయం ముట్టడికి వస్తారని కాంగ్రెస్ నేతల ఇండ్ల ముందు పోలీసు బలగాల మోహరించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, పొన్నాల, షబ్బీర్ అలీ, నాగం జనార్దన్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, ప్రీతం కుమార్. ఇళ్ళ ముందు పోలీసుల మోహరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తరువాత తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ మాదిరిగా నిర్మించబడింది. నిజాంకు ఖాజానాగా ఉపయోగపడిన భవనాన్ని, ప్రస్తుతం సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 10 బ్లాకులుగా నిర్మించారు.
నిర్మాణం
ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లతో 1888లో యూరోపియన్ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది. కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
చరిత్ర
మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, హుస్సేన్ సాగర్ సమీపంలోని ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని ఆస్థాన వైద్యులు (హకీంలు) సూచించారు. 1987లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మాణం జరుగుతుండగా, ఒక రోజు తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి ప్యాలెస్‌ను చూడడానికి ఏనుగు అంబారీపై అలీ ఖాన్ బయల్దేరాడు. ప్యాలెస్ సమీపంలోకి రాగానే ఒక అశుభ సూచకం ఎదురొచ్చింది. అది చూసిన జ్యోతిషులు పురానా హవేలీని వదలడం మంచిది కాదని నిజాంకు జోస్యం చెప్పడంతో సైఫాబాద్ ప్యాలెస్ కు వచ్చే ఆలోచనను మానుకున్నాడు. దాంతో నిజాం ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైద్రీ, ప్రధానమంత్రి కార్యాలయాల కోసం ఈ ప్యాలస్ కేటాయించబడింది.
స్వాతంత్య్రం తరువాత
స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డిన తరువాత బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, టి. అంజయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి తదితర ముఖ్యమంత్రులు జి బ్లాక్ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. చివరగా నందమూరి తారక రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.