Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు
Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2021-2022 ఏడాదికి గాను తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ ఈఐఎస్) దరఖాస్తులను కోరుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న మొత్తం 204 పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పైన తెలిపిన తరగతులకు బాలురు 107, బాలికలు 97 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2020-2021 ఏడాదికిగాను 4, 5, 6, 7 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో లక్షా యాబై వేల రూపాయాలు, పట్టణాల్లో రెండు లక్షల రూపాయాలు మించకూడదు.
* ఐదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2009 – 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.
* ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2008 – 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి.
* ఏడో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2007 – 31.08.2010 మధ్య జన్మించి ఉండాలి.
* ఎనిమిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2006 – 31.08.2009 మధ్య జన్మించి ఉండాలి.
* దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఇందుకోసం ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదిగా 20.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు http://tmreis.telangana.gov.in/ ని సందర్శించండి.