Malla Reddy: రేవంత్ రెడ్డి బ్రోకర్ పని చేసి పీసీసీ పదవి తెచ్చుకున్నాడు

* రేవంత్ రెడ్డి పీసీసీ పదవి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఒక చీడపురుగు

Update: 2021-08-25 14:15 GMT

 మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Malla Reddy: మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి తిరిగి ఎంపీగా గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల్లోనుంచి తప్పుకుంటానని రేవంత్ ఓడిపోతే ముక్కు నేలకు రాయాలన్నారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి బ్రోకర్ పని చేసి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రాకముందే ఇంజినీరింగ్ కాలేజీ పెట్టానని ఎవరి భూములు ఆక్రమించుకోలేదన్నారు మల్లారెడ్డి

మేడ్చల్ మూడు చింతలపల్లి మండలం లో దళిత గిరిజన 48 గంటల సభ పెట్టారు. ఆ మండలాన్ని సీఎం దత్తత తీసుకున్న తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు.ఎక్కడ లేని అభివృద్ధి ఈ మూడు గ్రామాల్లోనే జరిగింది. మూడు చింతలపల్లి మండలం 13 గ్రామాలు ఉన్నాయి 12 trs ఎంపిటిసిలు ఉన్నారు. ఇక్కడ అందరికి పెన్షన్ ,పెళ్లిళ్లు అయితే కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు భీమా వస్తున్నాయి. మా దగ్గర ఉన్న పథకాలు అన్ని ఫ్లెక్సీ లలో కట్టారు..మూడు చింతలపల్లి లో నెక్లెస్ రోడ్డు మాదిరిగా రోడ్లు ఉన్నాయి.

10 సంవత్సరాల క్రితం మీరు ఎం చేసారో చూపించాలి.కేసీఆర్ అంటే ఒక చరిత్ర.., మహాత్ముడిని పట్టుకొని అలా తిట్టడం ఏంటి. నేను పాలు అమ్మిన,గులాబీ పువ్వులు అమ్మిన తప్పేంటి.. నేను ఎం బ్రోకర్ దందా చేయలేదు. లక్షల మంది ఇంజనీర్లు, డాక్టర్లను చేసాను.నువ్వు చేసేది బ్రోకర్ పనులు దళారీ బట్టేబాజ్..బ్రోకర్ పనులు చేసి పిసిసి తెచ్చుకున్నాడు.

మల్లారెడ్డి కి ఉన్న 13 ఇంజనీరింగ్ కాలేజీలలో క్లియర్ గా ఉన్నాయని పార్లమెంట్ నివేదిక ఇచ్చింది.. నేను రాజకీయాల్లోకి రాకముందే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. నేను ఎవరి భూమి కబ్జా పెట్టలేదు..నాకు అసైన్డ్ భూమి లేదు నేను కోన్న భూమి ఉంది..నువ్వు ఎంతోమంది దగ్గర పైసలు వసూలు చేశావ్..ఇన్ని పథకాలు దేశం లో ఎక్కడైనా ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా నా ఛాలెంజ్.. పాలు అమ్మితే బ్రోకర్ పనా.. యాదవులను అవమానిస్తవా దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్ 20 నెలల్లో అధికారంలోకి వస్తదని అప్పుడే సీఎం అయినట్టు ఊహిస్తుండని మల్లారెడ్డి అన్నారు.

Tags:    

Similar News