Lockdown: నాలుగవ రోజుకు లాక్‌డౌన్.. రోడ్లపైకి భారీగా జనం
Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నాలుగవ రోజుకు చేరుకుంది.
Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నాలుగవ రోజుకు చేరుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ లాక్‌డౌన్ సడలింపుల నేపధ్యంలో ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. నిత్యావసరాలకు 4 గంటలే సమయం ఉండడంతో మార్కెట్లలో జనం పోటీ పడ్డారు. ఈ క్రమంలో భాగ్యనగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అటు సూపర్ మార్కెట్‌లు, రైతు బజార్‌లు కిటకిటలాడుతున్నాయి. సూపర్ మార్కెట్‌ల దగ్గర భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మలక్ పేట, బేగంబజార్, బడిచౌడి ప్రాంతాల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు కనిపించని పరిస్థితి నెలకొంది.