Telangana: ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా ఉంది: హైకోర్టు

Telangana: పెద్దపల్లి జిల్లా మంథనిలో న్యాయవాదుల జంట హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది.

Update: 2021-02-18 07:59 GMT

Peddapalli: ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా ఉంది: హైకోర్టు

Telangana: పెద్దపల్లి జిల్లా మంథనిలో న్యాయవాదుల జంట హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని సీజే ధర్మాసనం తెలిపింది. విచారణ చేపట్టిన ధర్మాసనం వామన్ రావు, నాగమణి హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు.

నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. న్యాయవాదుల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందన్న హైకోర్టు.. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. వామన్ రావు దంపతుల హత్య కేసులో సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయంమని హైకోర్టు తెలిపింది. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని న్యాయవాదుల హత్య అందరినీ దిగ్ర్బాంతికి గురిచేసిందని పేర్కొంది. న్యాయవాదుల హత్య కేసు విచారణ మార్చి ఒకటికి వాయిదా పడింది.

Tags:    

Similar News