నేడు సుప్రీంకోర్టులో గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Update: 2024-10-21 02:42 GMT

నేడు సుప్రీంకోర్టులో గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్డు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు వెళ్లారు. నిరుద్యోగుల తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

అంతకుముందు జీవో 29 రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా... ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. డివిజన్ బెంచ్ సైతం సమర్థించడంతో... సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది.

Tags:    

Similar News