Telangana New Ration Card: కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధం...దరఖాస్తు ఫారం సిద్ధం చేస్తున్నాం..మంత్రి ఉత్తం ప్రకటన
Telangana New Ration Card: భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు సైతం లింకు ఉండదని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇకపై తెలంగాణలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు సైతం లింకు ఉండదని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇకపై తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన శాసనమండలిలో పేర్కొన్నారు.
గడచిన పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వివాహం చేసుకొని కుటుంబం నుంచి వేరుపడి కొత్త కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి పేద కుటుంబాలకు రేషన్ కార్డు లభించలేదని దీనికి కారణం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్లేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ ఆరోగ్యశ్రీ పథకాలకు వేర్వేరు కార్డులు జారీ చేయబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ పేర్కొన్నారు. రేషన్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో అతి త్వరలోనే దరఖాస్తు ఫార్మాట్ ను కూడా సిద్ధం చేస్తామన్నారు. దీనిపై కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
క్యాబినెట్ నిర్ణయించిన ఫార్మాట్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 89 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని మంత్రి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో 54 లక్షల కుటుంబాలను పేద కుటుంబాలుగా గుర్తించింది అని ఉత్తమ్ కుమార్ సమాచారం తెలిపారు. అతి త్వరలోనే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా ప్రజలకు జారీ చేస్తామని ఇకపై తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ పని ఉండదని ఆయన తెలిపారు.