Telangana: భూముల మార్కెట్‌ విలువను పెంచే యోచనలో టీ సర్కార్

Telangana: ఓ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువకు, బహిరంగ మార్కెట్‌ రేట్‌కు పొంతనే ఉండదు.

Update: 2021-06-18 16:00 GMT

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: ఓ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువకు, బహిరంగ మార్కెట్‌ రేట్‌కు పొంతనే ఉండదు. వేలల్లో మార్కెట్‌ విలువ ఉంటే అదే భూమికి బహిరంగ మార్కెట్‌ లో లక్షల్లో డిమాండ్‌ ఉంటుంది. ఎప్పుడో కాంగ్రెస్‌ హయాంలో భూములకు నిర్ధేశించిన మార్కెట్‌ విలువ ఇప్పటిదాక కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సడన్‌గా మార్కెట్‌ విలువ పెంచే పనిలో పడింది. కమిటీలను వేసి మరీ భూముల ధరలకు రెక్కలు తొడిగిస్తోంది. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా మార్కెట్‌ విలువను ఎందుకు పెంచాలనుకుంటోంది. అసలు కేసీఆర్ సర్కార్‌ టార్గెట్‌ ఏంటి.?

కరోనా దెబ్బతో రాష్ట్ర ఆర్థిక ఖజానాకు భూముల అమ్మకాలే దిక్కయ్యాయి. భూములను విక్రయించి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే భూముల ధరలకు బహిరంగ మార్కెట్‌లో రెక్కలచ్చాయి. కానీ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ మాత్రం అలానే ఉండిపోయింది. ఈ టైంలో సర్కార్‌ భూములను అమ్మితే ప్రభుత్వానికి లాస్‌ వస్తుంది. అందుకని మార్కెట్‌ విలువను పెంచాలని డిసైడ్‌ అయ్యింది కేసీఆర్ ప్రభుత్వం.

'మార్కెట్‌ విలువ అంచనా కమిటీ'లను నియమించి, భూముల రేట్ల అధ్యాయనాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీలు సర్వే నంబర్ల ఆధారంగా పట్టణాలు, నగరాలు, హైవేలపై ధరలను నిర్ణయించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు 30 శాతం, గ్రేటర్ హైదరాబాద్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 శాతం వరకు పెంచే అవకాశముంది. ఇక వ్యవసాయ భూములకు 20శాతానికి పైగా పెంచే ఛాన్స్ ఉంది.

2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూములకు విలువను నిర్ధారించింది. అప్పటి నుంచి అదే పద్ధతి అమలులో ఉంది. అయితే అప్పటికీ ఇప్పటికీ బహిరంగ మార్కెట్లలో విలువ పెరగడం, రియాలర్ట్ రంగం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చుట్టూ పక్కల భూములకు రేట్లకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం భూముల అమ్మకాలపై ప్రధానంగా దృష్టి సారించింది. కానీ మార్కెట్‌ విలువ తక్కువగా ఉండడంతో దానిని సవరించేందుకు ప్రణాళికలరు రచిస్తోంది ప్రభుత్వం.

ప్రభుత్వం ఒక ఫ్లాట్ కోసం నిర్ణయించిన ధర వెయ్యి నుంచి 2 వేలు ఉంటే అది బహిరంగ మార్కెట్ లో 10వేలు పలుకుతోంది. హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పరమైన భూములను ప్రభుత్వమే విక్రయిస్తే తక్కువ పలుకుతోంది. అదే బయట మార్కెట్ విలువ ప్రకారం పోల్చి అమ్మితే కోట్ల రూపాయలు పలుకుంది. ఈ నేపథ్యంలో పాతపద్ధతిని మార్చి కొత్తగా మార్కెట్ విలువ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం సమకూరుతుంది. భూములు అమ్ముకోవడంతో పాటు ధరల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఏ ప్రాంతాల్లో ఎంత వరకు ధరలు పెరుగనున్నవి అనేది కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది.

Tags:    

Similar News