మహాత్మాగాంధీ వర్ధంతి: నివాళులు అర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి జనవరి 30, గురువారం రోజున నిర్వహించారు.

Update: 2020-01-30 10:39 GMT

 సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి జనవరి 30, గురువారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ‌వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్‌ ‌నేత ఎల్‌కే అడ్వాణీ, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు తదితరులు బాపూజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని దొరల చెరనుంచి విడిపించిన మహాత్ముడని కొనియాడారు. జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు.

ఇక ఇదే నేపథ్యంలో బాపుఘాట్‌ వద్ద గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం అహింసా మార్గంలో నడిచి గాంధీజీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని, ఆయన చేసిన సేవలు చిరస్మరనీయం అని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహాత్మాగాంధీని స్మరించుకున్నారు. ఆయన ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చని గాంధీజీ నిరూపించారని అన్నారు. ఎన్నో సమస్యలకు గాంధీ సందేశం పరిష్కారం చూపిందని కేసీఆర్ అన్నారు. ఆయన మార్గం ఎల్లప్పుడూ ఆచరణీయమని కొనియాడారు. ఇలాంటి మహత్ముడిని గాడ్ సే పొట్టన పెట్టుకున్నాడని అది ఎంతో విచారకరమణి ఆయన అన్నారు.

 


Tags:    

Similar News