పూర్తిస్థాయి వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ

Update: 2020-06-24 10:15 GMT

కరోనా కారణంగా రెండు, మూడు నెలల నుంచి ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం సగం వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నెల నుంచి వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. జూన్‌ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన బకాయిలకు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది.

కరోణా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వం పింఛనుదారు, ఉద్యోగుల వేతనాల్లో కోతను విధించింది. మార్చి నెలలో విధించిన కోత పరిస్థితుల కారణంగా ఏప్రిల్‌, మే నెలలో కూడా కొనసాగింది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో అన్ని పరిశ్రమలు, కార్యలయాలు నడుస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడుడిప్పుడే గాడిన పడడం మొదలయింది. దీంతో కేసీఆర్ సర్కారు ఈ నెల పూర్తి వేతనాలు చెల్లించాల్సిందిగా పేర్కొంది.


Tags:    

Similar News