Telangana Govt LRS Scheme: 2020 LRS దరఖాస్తుల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Govt LRS Scheme: దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు,కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప.. ఇతర లే అవుట్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం

Update: 2024-02-26 10:26 GMT

Telangana Govt LRS Scheme: 2020 LRS దరఖాస్తుల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Govt LRS Scheme: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. గత ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం LRS తీసుకురాగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉండటంతో.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

Tags:    

Similar News