TS Flood Victims: తెలంగాణలో ఆ జిల్లాల ప్రజలు గుడ్ న్యూస్..వారి అకౌంట్లోకి రూ. 17,500
TS Flood Victims: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యే వరంగల్, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. వరద కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి ప్రజల దుస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి వారికి ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మధ్యే తెలంగాణ సర్కార్ వరద బాధిత కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దాంతో ప్రజల నుంచి పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. వరదలతో సర్వం కోల్పోతే రూ. 10 వేలు మాత్రమే ఇస్తారా అని బాధితులు ప్రశ్నించారు. ఈ సారి వచ్చిన వర్షాలు, వరదలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఉద్దేశించి ప్రభుత్వం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
వరదల్లో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. 17,500 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంత తక్కువ డబ్బు బాధితులకు సరిపోదని తెలిసినప్పటికీ తప్పనిపరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఖజానాలో డబ్బు లేదు. ప్రభుత్వ పథకాలతోపాటు ఈ మధ్యే రుణమాఫీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇవ్వాలి. అందుకే ప్రభుత్వం ఈ డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
ఇక ప్రభుత్వానికి రైతుల సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే రుణమాఫీ అమలు కాలేదని లక్షల మంది రైతులు ఆవేదన చెందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పంటలు నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. వారిని ఆదుకునేందుకు సిద్ధపడిన ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. రూ. 10వేలు ఎలా సరిపోతాయంటూ నిలదీస్తున్నాయి. ఎకరాకు రూ. 30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్య ఎంత పంట నష్టపోయారో రిపోర్టు వచ్చిన తర్వాతే దాన్ని బట్టి ప్రభుత్వం పరిహారంపై మరోసారి ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.