తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా నుండి కోలుకున్నారు. శనివారం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనపడుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7నుండి మొదలవుతున్నందున అందరూ పరీక్షలు చేయించుకోవాలన్న స్పీకర్ సూచన మేరకు మంత్రి హరీష్ రావు టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో పాజిటివ్ రావటంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. అప్పట్నుంచి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హరీష్‌రావు కరోనాను జయించారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. క్రమంగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.