UPI Apps: విద్యుత్ వినియోగదారులకు షాక్
UPI Apps: విద్యుత్ బిల్లులు చెల్లింపుదారులకు విద్యుత్‌శాఖ షాక్ ఇచ్చింది.
UPI Apps: విద్యుత్ బిల్లులు చెల్లింపుదారులకు విద్యుత్‌శాఖ షాక్ ఇచ్చింది. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు TGSPDCL విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని ఎక్స్ ద్వారా తెలిపింది.
బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.