TS EAMCET Results 2020: టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్ ఫలితాలు నేడే

Update: 2020-10-24 06:33 GMT

తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌‌ ఫలితాలు నేడు (శనివారం) విడుదలకానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్‌, అగ్నికల్చర్‌ విభాగాలకు అధికారులు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ విడుదల చేయనున్నారు. అయితే విద్యార్దులు ఈ పరీక్షా పలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అలాగే http://www.manabadi.co.in/Entrance-Exams/ts-eamcet-results-telangana-eamcet-results.asp వెబ్ సైట్ లలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు సర్టిఫికెట్లను కౌన్సెలింగ్‌ కోసం సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ నెల 28న ఎడ్‌సెట్‌, నవంబర్‌ 2న ఐ సెట్‌, ఫలితాలు ప్రకటించనున్నట్లు పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలను విద్యాశాఖ గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 63,857 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోండి.

అభ్యర్థులు ముందుగా TS EAMCET https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.

తరువాత పుట్టిన తేది, హాల్ టికెట్ నంబరును ఎంటర్ చేయాలి.

తరువాత 'View Results' పైన క్లిక్ చేసుకోవాలి.

దాంతో మీ ఫలితాలు వెలువడతాయి.

Tags:    

Similar News