ఒక యాగం-రెండు ఫలాలా?

Update: 2019-08-02 15:07 GMT

మహాసుదర్శన యాగం. ఇప్పుడు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తలపెడుడున్న అతి పెద్ద మహా యాగం. ఈ యాగంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి ఆలయ పునురుద్దరణ తర్వాత, మహా సుదర్శన యాగం చేయాలని ముందే నిర్ణయించినా, ప్రస్తుతం కేసీఆర్ ఇదే సమయాన్ని ఎంచుకోవడంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంతటా వినిపిస్తున్న చర్చ రాష్ట్రంలో హిందుత్వంతో దూకుడుగా విస్తరించాలని తపిస్తున్న బీజేపీకి, ఈయాగంతో చెక్ పెట్టి, దీంతో తనకంటే పెద్ద హిందుత్వవాది ఈ రాష్ట్రంలో ఇంకెవరూ లేరని చెప్పకనే చెబుతున్నారా? యాగంతో ఆధ్యాత్మిక ఫలంతో పాటు రాజకీయ ఫలితం కూడా కేసీఆర్‌ కాంక్షిస్తున్నారా?

తెలుగురాష్ట్రాల్లో యాగాలు, హోమాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలంటే ముందుగా గుర్తొచ్చే నేత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇప్పటికే ఎన్నో యాగాలు, హోమాలు చేసిన ఆయన, తాజాగా మరోసారి భారీ క్రతువుకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి దేవస్థానం పునురుద్దరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మహా సుదర్శన యాగాన్ని తలపెట్టారు కేసీఆర్. ఇప్పటికే ఇందుకోసం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామితో చర్చలు చేసినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా, అందుకు ముందు మహాయాగాన్ని చేయడం పరిపాటిగా మారింది. మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఏదో సమయంలో, ఏదో ఒక యాగాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఎవరూ కనివిని ఎరుగని మహాసుదర్శణ యాగాన్ని, యాదాద్రిలో వంద ఎకరాల విస్తీర్ణంలో 1048 యగ్నవాటికలతో, మూడు వెేల మంది బుుత్వికులు మూడు వెేల మంది వారి అనుచరులో ఈ యాగం చేయాలని సంకల్పించారు. ఇందుకు తగిన సమయం కోసం చూస్తున్నారు.

గులాబీ పార్టీ అధినేత ఏం చేసినా అందుకు తనదైన రాజకీయ కారణాలుంటాయని అంటారు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వారు. ప్రస్తుతం కేసీఆర్ తలపెట్టిన మహా సుదర్శన యాగం కూడా అందుకు ఓ వేదికగా ఉపయోగ పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు గవర్నలు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇటు బద్రినాథ్ పూరి తిరుమల శ్రీరంగం లాంటి పెద్ద వైష్ణవ పీఠాల నుంచి ఆయా క్షేత్రాల నుంచి మతాధిపతులను ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో ఆయుత చండీయాగం లాంటి అతిపెద్ద యాగాలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీకీ చెక్ పెట్టడానికి, తనకంటే ఈ రాష్ట్రంలో అదిపెద్ద హిందుత్వ వాది ఎవరూ లేరని చెప్పుకోవడానికి, ఇలాంటి యాగాలాను వేదికగా చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క దెబ్బతో ఇటు, తన పట్టు ప్రభావం, పెంచుకోవడం, మరోవైపు వైరి రాజకీయ పక్షాలకు చెక్ పెట్టడం, రెండూ నెరవేరుతాయని అంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఒక్క దెబ్దకు రెండు పిట్టల వ్యూహ రచన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు తన ఆధ్యాత్మిక అంశాలు నెరవేర్చుకోవడం అటు ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు చెక్ పెట్టే వ్యూహం కూడా దాగుందని, పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. 

Full View

Tags:    

Similar News