CM Revanth: ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
CM Revanth: తాజాగా హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth: ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు అంటేనే ఒక బ్రాండ్. తెలుగు సినిమా స్థాయిని, ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా స్థాయిని ఓ మెట్టు ఎక్కించిన ఘనత ప్రభాస్‌ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలితో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన ప్రభాస్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగారు. కేవలం అభిమానులే కాకుండా సినిమా సెలబ్రిటీలు సైతం ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ తెలుగు సినిమాకు ఒక ఐకాన్ అంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇక హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన ‘బాహుబలి’ సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేం’ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
వాళ్లు ఆ స్థాయిలో రాణించడానికి కఠోర శ్రమే కారణని సీఎం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వర్మ తనకు మంచి మిత్రుడన్న రేవంత్.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది సలార్‌తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. తాజాగా కల్కితో మరో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితో పాటు.. ది రాజా సాబ్, నాగ్ అశ్విన్ తో కలిసి కల్కి 2, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.