Telangana: ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana: ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. పీఆర్సీ అమలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనుంది.
Telangana: ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. పీఆర్సీ అమలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే, ఏఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించనున్నారో మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. కోవిడ్ కేసులు పెరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా 50వేల ఉద్యోగాల భర్తీపై కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
రేపు ఉదయం 11:30కి శాసనసభలో ఆర్థికమంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 15 శాతం ఎక్కువగా కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2 లక్షల కోట్ల చేరువలో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఈ బడ్జెట్లోనే నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని చర్చ జరుగుతోంది. ఈసారి, ఇరిగేషన్‌తోపాటు ఆరోగ్యశాఖకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భారీగా నిధులు అలాట్ చేయనున్నట్లు తెలుస్తోంది.