TS Voter List 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్ట్ విడుదల

TS Voter List 2023: 18-19 ఏళ్ల వయసు వారు 8 లక్షల 11 వేల 640 మంది

Update: 2023-10-04 12:03 GMT

TS Voter List 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్ట్ విడుదల

TS Voter List 2023: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ బుధవారం ఓటర్ల జాబితాల రెండవ ప్రత్యేక సారాంశ సవరణ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన మొదటి ప్రత్యేక సారాంశ సవరణ జాబితా కంటే 5.8 శాతం పెరుగుదలతో దాదాపు 17 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు.

తుది జాబితాలో 119 నియోజకవర్గాల్లో 3కోట్ల 17లక్షల 17వేల 389 మంది ఓటర్లు ఉండగా అందులో 1కోటి 58 లక్షల మంది మహిళలు, 1కోటి 58 లక్షల మంది పురుషులు, 2,557 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 8లక్షల 11వేల 640 మంది ఓటర్లు 18-19 ఏళ్లలోపు ఉండగా, 6లక్షల 10వేల 694 మంది చనిపోయిన, డూప్లికేట్, షిఫ్ట్ అయిన ఓటర్లు తొలగించబడ్డారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4లక్షల 43వేల 943 మంది, దివ్యాంగులు 5లక్షల 06వేల 493 మంది ఉన్నారు.

ఇంటింటికి అనేక రౌండ్లు సర్వేలు, ధృవీకరణలు చేపట్టారు. ఈ సంవత్సరం ఓటర్ల జాబితాలో 14లక్షల 24వేల 694 నమోదుల సవరణలు జరిగాయి. 4లక్షల 15వేల 824 మంది ఓటర్ల చిరునామాలు సరిచేయబడ్డాయి. 3లక్షల 94వేల 968 మంది ఓటర్లు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్‌కు, 64వేల 661 మంది ఓటర్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరొక అసెంబ్లీకి మారారు, సరైన పోలింగ్ స్టేషన్‌ను సక్రమంగా కేటాయించారు.

Tags:    

Similar News