అమెరికాలో వెలసిన ఓరుగల్లు ఏకశిల హనుమాన్ విగ్రహం...

Update: 2020-06-17 12:51 GMT

దేవాలయాలు, విగ్రహాలు, పూజలు కేవలం భారతే దేశంలో మాత్రమే కాదు విదేశాలలో కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కూడా అక్కడక్కడా తెలుగు దేవాలయాలను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోకెల్లా ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని హకెస్సిన్‌లోని మీనాక్షి ఆలయంలో ప్రతిష్టించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విగ్రహం వరంగల్ లో రూపొందించారు. సుమారు 25 అడుగుల ఎత్తయిన ఈ నల్లరాతి ఏకశిలా విగ్రహా తయారికి అనువైన రాయిని గుర్తించి తయారు చేసి అమెరికా తరలించడానికి 8 నెలలకుపైగా సమయం పట్టింది. ఈ విషయాన్ని డెలవేర్‌లోని హిందూ ఆలయ సంఘం బోర్డు ట్రస్టీస్ సభ్యుడు, ఆపరేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తోన్న బాల్‌రెడ్డి కామిరెడ్డి తెలిపారు.

ఇక ఈ విగ్రహ తయారికి రవాణా ఖర్చులు కాకుండానే ఈ విగ్రహ తయారీకి లక్ష డాలర్లు ఖర్చయిందని కామిరెడ్డి తెలిపారు. అంతే కాదు 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఏకశిలా విగ్రహం సుమారుగా 30 టన్నుల బరువు తూగుతుందని ఆయన వివరించారు. ఈ విగ్రహం తయారికి రాతిని గుర్తించడం కోసం నలుగురు సభ్యులబృందం మీనాక్షి ఆలయం నుంచి భారత్ వచ్చిందని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులు ముందుగా రాజస్థాన్‌ వెళ్లారు. కాగా అక్కడ సరైన రాతిని గుర్తించక పోవడంతో చివరకు వరంగల్ చేరుకుంది. స్థపతి సూచనల మేరకు డిసెంబర్లో ఈ విగ్రహ తయారీ పూర్తయింది. 1996లో జోయ్ బిడెన్ మీనాక్షీ దేవి ఆలయాన్ని ప్రారంభించారు.

ఈ ఆలయ ప్రారంభోత్సవ సమయంలో జోయ్ బిడెన్ అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ల అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు. కాగా ఈ శనివారం హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆదివారం కుంభాభిషేకం నిర్వహించారు. ఇక వరంగల్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి ఈ విగ్రహాన్ని అమెరికాకు తరలించడానికి అమెరికాలో స్థానిక ప్రభుత్వం అద్భుతంగా సహకరించిందని బాల్‌రెడ్డి కామిరెడ్డి తెలిపారు. నాలుగు పోలీసు వాహనాలను కాన్వాయ్ తో న్యూ క్యాస్ట్‌లే కౌంటీ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ మైర్ కలవగా విగ్రహాన్ని తీసుకెళ్లారని తెలిపారు. విగ్రహాన్ని తరలిస్తున్న ట్రక్కు ఎక్కడా కూడా ట్రాఫిక్ లో చిక్కుకోకుండా అన్ని ఏర్పాట్లను చేసారు. ఇందులో భాగంగానే డెలవేర్‌లోని మెమోరియల్ బ్రిడ్జి నుంచి ఆలయం వరకు 25 కి.మీ. పొడవునా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. 

Tags:    

Similar News