జనతా కర్ఫ్యూతో తెలంగాణ మంత్రులు ఇంటికి పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటుడంపై మంత్రులు హరీష్ రావు, తలసాని, జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా కుంటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నానని తెలిపారు.
'ఏం కాదనే ధోరణి వద్దు.. ఇలాంటి ధోరణి వల్లే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికి పోతున్నాయో చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం. మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని,మన దేశాన్ని రక్షించు కుందాం. మన ఇంట్లో మనం ఉందాం. కరోనాను ఖతం చేద్దాం' అని హరీశ్‌రావు వీడియో సందేశం ఇచ్చారు.