కేంద్ర ప్రభుత్వం లక్దౌన్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుపడి పోయిన వారు వారి వారి ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ఫస్ట్ ట్రైన్ ప్రారంభమైంది. 24 కంపార్ట్‌మెంట్లలో దాదాపు 1100 మంది కూలీలతో లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కు శుక్రవారం తెల్లవారుజామున స్పెషల్ ట్రైన్ బయలుదేరినట్లు అధికారులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితలో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.