Harish Rao: ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధ పడుతున్నారు
Harish Rao: పిట్లల్లాగా ప్రజలు చనిపోతుంటే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు
Harish Rao: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని, హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు... ఓ వైపు తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధ పడుతూ... పిట్లల్లాగా ప్రజలు చనిపోతుంటే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారాయన... బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రేవంత్ సర్కార్ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత తప్పుంటే కూలగొట్టాలని హరీశ్ సూచించారు.
రాజకీయంగా పల్లాను ఎదుర్కొలేక.. ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో పల్లా భూములు లేవని, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు రిపోర్టు ఇచ్చాయన్నారు హరీశ్.. కలెక్టర్ కూడా ఎన్‌వోసీ జారీ చేశారని, హెచ్ఎండీఏ అనుమతితోనే కాలేజీ నిర్మిచారని ఆయన చెప్పారు. రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే రాజకీయ ప్రేరిత విషయాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, విద్యాసంస్థలు, ఆస్పత్రులపై రాజకీయ కక్షలు ఎందుకు అని హరీశ్ రావు ప్రశ్నించారు.