Virus Killer Machine : సిద్దిపేట యువశాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ

Update: 2020-09-28 09:43 GMT

Virus Killer Machine : కరోనా వైరస్ ఈ పేరు వింటూనే జనాలు ఆమడ దూరం పరుగులు పెడుతున్నారు. బయటికి వెళ్లాలన్నా, ఏమైనా వస్తువులు కొనాలన్నా, వేరే వారినుంచి వస్తువులను తీసుకోవాలన్నా భయమే. అయినా తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకున్నప్పటికీ ఎలాంటి వైరస్ తమకు రాకుండా ఉండేందుకు ఓ పరికరాన్ని కనిపెట్టాడు. కరోనా వైరస్‌ మనం నిత్యం వాడుకునే వస్తువులపై ప్రభావం చూపకుండా అడ్డుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడనుంది. అయితే ఈ పరికరాన్ని సిద్దిపేటకు చెందిన కాపర్తి భార్గవ్‌ అనే యువశాస్త్రవేత్త కనిపెట్టాడు. అతను కనిపెట్టిన పరికరానికి యూవీసీ వైరస్‌ కిల్లర్‌ మెషీన్‌ అని పేరుపెట్టాడు. ప్రజలు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న తీరును గమనించిన భార్గవ్‌ ఈ వైరస్‌ కిల్లర్‌ను తయారు చేశాడు.

భార్గవ్‌ అనే యువశాస్త్రవేత్త హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఇన్ఫర్మేష‌న్ టెక్నాలజీలో సెకండియర్‌ చదువుతున్నాడు. ప్రజలకు కరోనా నుంచి బయటపడేయడానికే ఈ పరికరాన్ని కనిపెట్టాడు. ఇక ఈ పరికరాన్ని తయారుచేసేందుకు కేవలం 600రూపాయలను ఖర్చుచేసాడు. దీన్ని తయారు చేయడానికి అట్టబాక్స్, రిఫ్లెక్షన్ కవర్, థర్మకోల్, యూవీసీ (అల్ట్రా వయొలెట్‌ కాంపైజర్‌) బల్బ్, కనెక్టర్‌లను ఉపయోగించారు. ఇక ఈ పరికరంలోకి బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన వస్తువులను, అలాగే నిత్యావసర సరుకులు ఈ బాక్స్‌లో పది నిమిషాలు పెడితే చాలు దాని రేడియేషన్ కి వైరస్‌ ఉన్నట్టయితే చనిపోతుంది. దీంతో ఎవరూ కూడా వైరస్ బారిన పడకుండా ఉండిపోవచ్చు. దీంతో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నాడు. యూవీసీ కిరణాలు మన శరీరానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.




Tags:    

Similar News