Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త

Hyderabad: రేపు నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్

Update: 2024-04-22 15:43 GMT

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ వార్త

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు షాకింగ్‌ లాంటి వార్త ఇది. రేపు నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 23న నగరంలో మద్యం షాపులు మూసి ఉండనున్నాయని. సీపీ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ షాపులు మూసి ఉండనున్నాయని తెలియజేశారు.

నిబంధనలు ఉల్లంఘించి షాపులను తెరిచినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఈ వారంలో మద్యం షాపులు మూసి వేయడం ఇది రెండో సారి. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా నగరంలో వైన్స్‌ షాపులు మూసి ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బంద్ చేయనుండడంతో మద్యం ప్రియులకు వారంలోనే రెండు సార్లు షాక్ తగిలినట్టైంది.

Tags:    

Similar News